ఆలస్యంగా వచ్చినా ఒక ఏడాదిలోనే జియో డేటా విప్లవం సృష్టించింది. ఏప్రిల్ 3 నుంచి JIO పేమెంట్ సేవలు ఆరంభం అయినట్టు అని రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నిన్న ఒక నోటిఫికేషన్ లో తెలిపింది..JIO పేమెంట్ బ్యాంకు ఇప్పుడు ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా చెలింపుల సేవల కోసం గాను పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు చేసుకునేందుకు 11 సంస్థలకు లైసెన్స్ ఇచ్చింది.
తొలుత Bharti AIRTEL సంస్థ గత ఏడాది నవంబర్ లో పేమెంట్ బ్యాంకు సేవలను ప్రారంభించిన తొలి కంపెనీగా నిలిచింది. తరువాత ఏడాది మే నుంచి PAYTM పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి . రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా త్వరలోనే పోస్టల్ విభాగంలో కూడా ఈ సేవలను ఆరంభించనున్నటు సమాచారం .