YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కులవృత్తులకు ప్రోత్సాహం : మంత్రి తలసాని

కులవృత్తులకు ప్రోత్సాహం : మంత్రి తలసాని

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తూ పూర్వ వైభవం తీసుక రావడానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, డైరీ, సినిమా ఆటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు  కంది మండలం ఎర్దనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్సిడీ గొర్లకు ఉచితంగా గొర్రెల దాణాను మంత్రి పంపిణి చేసారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి సంక్షెమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు . గొర్రెల కాపర్లకు ఒక్కో యూనిట్ కు ఒక పొట్టేలు, ఇరవై గొర్రెలను పంపిణి చెయ్యడంతో పాటు వాటికి మందులు, దాణా, సంచార పశు వైద్య శాలలతో వైద్యం తో పాటు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నారు. రాష్ట్రం లో ఇప్పటి వరకు యాబై నాలుగు లక్షల గొర్రెలు వచ్చాయి అని వాటి ద్వారా ఇరవై మూడు లక్షల గొర్రె పిల్లలు జన్మించాయని అన్నారు. ప్రస్తుతం జిల్లలో 11,195 యూనిట్ ల గొర్రెలకు ప్రభుత్వం 2,309 మెట్రిక్ టన్నుల దానాను మంజూరు చేసింది అని రూ. 3,445 ల విలువ చేసే దానాను ఒక్కో యూనిట్ కు 4 బస్తాల చొప్పున లబ్ది దారులకు అందిస్తున్నట్టు మంత్రి  తెలిపారు. లబ్దిదారుల వద్ద ఉన్న సొంత గొర్రెలు, పశువుల దాణాకు రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మీద గడ్డి విత్తనాలు అందిస్తున్నాం అని మంత్రి అన్నారు.

Related Posts