YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం జ్ఞానమార్గం దేశీయం

నవదీప కాంతులతో నవ్య భారతం

నవదీప కాంతులతో నవ్య భారతం

నవదీప కాంతులతో నవ్య భారతం
తిమిరముపై జయకేతన  దివ్య  తేజితం
కరోనా మహమ్మారి కొరలు చాచగా
ప్రపంచమే నిస్తేజమై  నీరుకారగా
యుద్ధానికి సిద్ధమనే మానవజాతి
నరేంద్రుడే పిలుపునిచ్చే నవ దీపపుజ్యోతి
జన సమూహ నియంత్రణే
మొదటి అస్త్రమై
వ్యక్తిగత శుభ్రత మన దివ్య అస్త్రమై
కులమతాలకతీతమై అందరు కలిసి
నరేంద్రుని బాటలో నడిచి నిలిచీ
కనిపించని కరోనాను అంతం చేద్దాం
రక్కసి వైరస్ వ్యాప్తి తదముట్టిదాం
భారతీయులమంతాఒక్కటై నిలిచి
భారతీయ గొంతుగా ఒకటిగ కలిసి
నవదీపపు కాంతుల్లో నినదిద్దాం
కామన్ మెన్ కారని
కారణజన్ములు వీరిని
లోకానికి చాటుదాం
...మన జాతి ఔన్నత్యం.
      భారత్ మాతా కీ జై

\వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts