YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చేవెళ్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు

చేవెళ్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు

చేవెళ్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు
రంగారెడ్డి, ఏప్రిల్ 6
రంగారెడ్డి చేవెళ్ల మండలం తంగడపల్లి వద్ద జరిగిన మహిళ దారుణ హత్యాచారం కేసులో మరో కోణం బయటపడింది. దిశ ఘటన తర్వాత అంత స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో లోతుగా విచారించేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే ఆ మహిళను పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు నిందితులు కారులోనే ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన రెండో నిందితుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు ముంబయితో పాటు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. పట్టుబడిన నిందితుడిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. పెళ్లికి ముందు నుంచే ఇద్దరి మధ్య అక్రమ వ్యవహారం నడిచిందని, పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే నిందితుడు ఆమె హత్యకు ప్లాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.ఆ మహిళ, నిందితుడికి పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె భర్త కళ్లుగప్పి ఆమె చాలాసార్లు అతడితో సన్నిహితంగా మెలిగేది. ఈ క్రమంలోనే ప్రియుడు లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంది. దీంతో పెళ్లి చేసుకుని.. ఎక్కడికైనా దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామంటూ ఆమె ఒత్తిడి తెచ్చింది. వేరే అమ్మాయికి దగ్గర కావడంతో ఆమెను దూరంగా పెట్టాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు.లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామంటూ ఆ మహిళను నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. దుస్తులు లేకుండానే మృతదేహాన్ని తంగడల్లి వంతెన కిందకు దించారు. మొహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా బండరాయితో తలను ఛిద్రం చేసి ఆ రాయిని తమవెంట తీసుకెళ్లారు. ఈ కేసులో తొలుత ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. చివరికి నిందితులు అద్దెకు తీసుకున్న కారు జీపీఎస్ కీలకంగా మారింది. హత్య అనంతరం నిందితులు కారులో ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌పైకి చేరారు. ప్రొద్దుటూరు దగ్గర లభించిన సీసీ ఫుటేజీ ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో మరో నిందితుడు దొరికితే మృతురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

Related Posts