YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రంప్ ను ముంచేస్తున్న కరోనా

ట్రంప్ ను ముంచేస్తున్న కరోనా

ట్రంప్ ను ముంచేస్తున్న కరోనా
న్యూయార్క్, ఏప్రిల్ 6
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  కరోనా కు భయపడిపోతున్నారా? అవును కరోనా ఎఫెక్ట్ తన విజయావకాశాల మీద ఉంటుందని ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో కూడా ఆందోళన మొదలయింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అమెరికా కోలుకోవాడానికి మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించాలని ట్రంప్ ఉత్సాహ పడుతున్నారు. అయితే ట్రంప్ ఆశలపై కరోనా నీళ్లు చల్లినట్లయిందంటున్నారు. కరోనాతో ప్రపంచంలోనే బ్యాడ్ ఎఫెక్ట్ దేశంగా అమెరికా ముందుంది. రెండున్నరల లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు లక్షల మంది వరకూ కరోనా వ్యాధితో మరణించే అవకాశముందన్న అంచనా ఉంది. కరోనా వ్యాప్తికి కారణం ట్రంప్ నిర్లక్ష్యమేనని ఇప్పటికే డెమొక్రాట్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వారు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో కూడా ఆందోళన మొదలయింది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్ పేరును ప్రకటించింది. కరోనా వైరస్ ని చైనా వైరస్ అంటూ ట్రంప్ లైట్ గా తీసుకోవడం, లాక్ డౌన్ వంటి చర్యలను ముందుగా తీసుకోకపపోవడంతోనే అమెరికాలో మరణాలు ఎక్కువగా సంభవించాయని ఎక్కువ మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డెమొక్రాట్ల అభ్యర్థిలో ముందు వరసలో ఉన్న జో బిడెన్ సయితం పుంజుకుంటున్నారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఏడాది ముందునుంచే ప్రచారం సాగుతుంది. అయితే ఈసారి కరోనా కారణంగా ప్రచారాన్ని అన్ని రాష్ట్రాల్లో నిలిపేశారు. అయితే డెమొక్రాట్ పార్టీ మాత్రం వర్చువల్ రౌండ్ సమావేశాల్లో ట్రంప్ తీరును ఎండకడుతోంది. ఈ పరిస్థితుల్లో ఒబామా ప్రవేశపెట్టిన ఒబామా హెల్త్ కేర్ స్కీమ్ ను కూడా ట్రంప్ రద్దు చేయడాన్ని ఆ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇటీవల జిరిగిన ఆన్ లైన్ సర్వేలో జోబిడెన్ కు 49 శాతం మద్దతు పలికినట్లు తెలుస్తోంది. అయితే రిపబ్లికన్ పార్టీ మాత్రం ఎన్నికల సమయానికి ట్రంప్ పుంజుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద కరోనా వైరస్ ట్రంప్ విజయావకాశాల మీద ప్రభావం చూపుతుందన్న చర్చ మాత్రం జరుగుతోంది.

Related Posts