YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సేవలో రాజకీయ నేతలు

సేవలో రాజకీయ నేతలు

సేవలో రాజకీయ నేతలు
హైద్రాబాద్, ఏప్రిల్ 6 
తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ఉండే రాజకీయ హడావిడి ఎక్కడా ఉండదు. ప్రజలు కూడా రాజకీయ పరిణామాలను నిత్యం గమనిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. కరోనా కట్టడిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించాయి. రాజకీయాలను పక్కన పెట్టాలని నిర్ణయించాయి. నిత్యం హడావిడిగా ఉండే పార్టీ కార్యాలయాలు సయితం బోసి పోయి కన్పిస్తున్నాయి. కరోనా వ్యాధి తీవ్రమవుతుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 350 దాటింది. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలయింది. ప్రజలసు స్వచ్ఛందంగా స్వీయ నిర్భంధం పాటిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా దాదాపు బంద్ వాతావరణమే కన్పిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులకు పిలుపునివ్వడంతో కొద్దిరోజులుగా వారు రోడ్లపైకి వచ్చి పోలీసులకు సహకరిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన పార్టీ కార్యక్రమాలను నిరవధికంగా వాయిదా వేసుకుంది. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచాలని పార్టీ నేతలు క్యాడర్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది కార్యకర్తలు అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే కార్యకర్తలను రంగంలోకి దించారు. ఇక వామపక్ష పార్టీలు సయితం కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి అందరికి మాస్క్ లను పంచుతామని ప్రకటించింది. నేతలు నియోజకవర్గాల్లోనే ఉండి సోషల్ డిస్టెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇలా తెలంగాణాలో ప్రధాన పార్టీలన్నీ రాజకీయాలను పక్కన పెట్టేసి ఇప్పుడు కరోనాపైనే దృష్టి పెట్టాయి. రానున్న రోజుల్లో మరింత సమస్య ముదిరే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపట్టింది.

Related Posts