దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఉద్యోగి
అక్రమ సంబంధమే కారణమై ఉండొచ్చనే అనుమానాలు
సూర్యాపేట ఏప్రిల్ 6
జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలో 108 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ, గ్రామంలో పిఎంపి గా ప్రాక్టీసు చేస్తున్న తంగేళ్ల నిరంజన్ పై గుర్తు తెలియని దుండగులు
హత్యా యత్నం జరిపారు. ఈ దాడిలో నీరంజన్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు, మెడపై కత్తి పోట్లు పడటంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం దరాబాద్ కి తరలించారు.ఆదివారం రాత్రి మండల కేంద్రంలో విధుల నిర్వహణలో ఉన్న ఆయనను సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో దుండగులు దాడి చేసినట్లు సమాచారం. బాధితుడు మండలంలోని రామన్నగూడెం గ్రామంలో పిఎంపి గా చేస్తూ ప్రస్తుతం అక్కడే నివాసముంటున్నాడు. గ్రామంలో చిట్టీల వ్యాపారం కూడా చేస్తున్నదున ఆర్ధిక లావాదేవిలు ఈ ఘటనకు దారి తీసివుండవచ్చే గ్రామస్థులు కొందరు పేర్కోండటుండగా, మరి కొందరు మాత్రం బాధితునికి అక్రమ సంబంధం ఉన్న కారణంగానే ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.