YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు డాక్టర్ కు కరోనా…పలు క్లినిక్కులు మూత

నెల్లూరు డాక్టర్ కు కరోనా…పలు క్లినిక్కులు మూత

 నెల్లూరు డాక్టర్ కు కరోనా…పలు క్లినిక్కులు మూత
నెల్లూరు ఏప్రిల్ 6 
నెల్లూరులో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటళ్ళకు నిలయమైన పొగతోట, బృందావనం ప్రాంతాలు వణికిపోయాయి. తొలిసారిగా ప్రయివేట్ డాక్టర్లకు కారోనా వైరస్ సోకిందని తెలియడంతో మిగతా డాక్టర్లలో కలవరం మొదలైంది. ఆ డాక్టర్లతో కలిసినవారు ఎవరికి వారు క్వారంటైన్ కి వెళ్ళిపోతున్నారు. వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని భయంతో ఆసుపత్రులు మూసేసుకుని వెళ్లిపోయారు. కరోనా పాజిటివ్ అనితేలిన డాక్టర్ ఆర్ధోపెడిక్ స్పెషలిస్టుగా పని చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటరుపై ఉన్నారు. దీంతో ఆ డాక్టరుకు సంబంధిందించిన వారిని క్వారంటైన్ కు పంపేశారు. కొద్దిరోజుల క్రితం ఆర్ధోపెడిక్ డాక్టర్ నగరంలోని వైద్యులందరికీ ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకి నగరానికి చెందిన చాలామంది డాక్టర్లు హాజరయ్యారు.ఈ నేపధ్యంలో ఆర్ధోపెడిక్ డాక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఫంక్షన్ కి వచ్చిన డాక్టర్లు, ఆయనతో సన్నిహితంగా వున్న వ్యక్తులు భయంతో వణికిపోతున్నారు. అందరిలోనూ ఒకటే టెన్షన్ మొదలైంది. తమలో ఎవరికైనా వైరస్ సోకిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆయన పని చేస్తున్న ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు, ఫంక్షన్ కి వెళ్ళిన వైద్యులంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. క్వారంటైన్ వార్డుకి వెళ్ళి నిర్ధారణ పరీక్షలకు చేయించుకుంటున్నారు. ఇక ఈ వార్త బైటికి రావడంతో మిగిలిన డాక్టర్లంతా ఇళ్ళకే పరిమితమవుతున్నారు. బైటికి వచ్చేందుకు కూడా సంకోచిస్తున్నారు.

Related Posts