ఈనెల 29 న జనసమితి ప్రతి ఇంటికి వెళ్ళాలి. కొందరు తాడు బొంగరం లేదని విమర్శించారు. బొంగరం ఎట్లా గిరా గిరా తిరుగుతుందో చూపించాలని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ అన్నారు. బుధవారం నాడు అయన తెలంగాణ జన సమితి కార్యక్రమంలో ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జనసమితి పోస్టర్, కరపత్రం, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ సన్నాహక కమిటీ లు ఈనెల 29 వరకు ఉంటాయి. 29 తర్వాత తాత్కాలిక కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఇక ఏ సంఘాలు ఉండవు అందరూ జన సమితే నని అయన స్పష్టం చేసారు. ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారికే జన సమితిలో ప్రాధాన్యత. తెలంగాణ కోసం అమరులు అయినా వారే జన సమితి కి స్ఫూర్తి. అమరుల స్ఫూర్తి మారిస్తే మనల్ని మనం మర్చినట్లే.తెలంగాణ కోసం అమరులు అయినా వారికి స్ఫూర్తి వనం ఏర్పాటు చేస్తాం. అమరుల కోసం సభికులు రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు