YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సుప్రీం తీర్పుకు బీజేపీ కి సంబంధం లేదు ఫ వేముల అశోక్, బీజేపీ ఎస్సీ మోర్చా

సుప్రీం తీర్పుకు బీజేపీ కి సంబంధం లేదు ఫ వేముల అశోక్, బీజేపీ ఎస్సీ  మోర్చా

ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ కేసు సవరణలు చేసింది సుప్రీం కోర్టు బీజేపీ కి సంబంధం లేదు. కావాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా   బీజేపీ ప్రభుత్వాని బాదునామ్ చేయడానికి కుట్రగా భావిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేముల ఆశోక్ అన్నారు. తెలంగాణలో దళితులకు అన్యాయం చేసింది తెరాస  పార్టీ కాదా అని అయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని అయన విమర్శించారు. 

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ది అవకాశవాద రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీని సుప్రీం కోర్టు న్యాయమూర్తితో  మాట్లాడమని అర్థం లేని సలహాలిస్తున్నాడు. కేసీఆర్ గారికి  రాజ్యాంగం గురించి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పత్రిక స్వాతంత్రం గురుంచి మంత్రి హరీష్ రావు మాట్లాడడం విడ్డురంగా ఉంది. ప్రజలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ  కేస్ సవరణల పై పార్లమెంటులో చర్చ జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ సలహాలిచే స్థాయిలో తెరాస లేదు. ఒక  పేపర్లో ప్రధాని మోడీని టార్గెట్ గా వార్తలు రాస్తుంటే మేము నిరసన తెలియజేసామని అన్నారు.

Related Posts