ఐసోలేషన్ వార్డులుగా మారిన 2,500 రైల్వే బోగీలు
హైదరాబాద్ ఏప్రిల్ 6
కరోనాను ఎదుర్కొవడానికి రైల్వే శాఖ సిద్దమవుతోంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు రైల్వే బోగీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటివరకు 2,500 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. 2,500 కోచ్‌ల్లో 40వేల పడకలు సిద్దం చేయనున్నారు. అటు రోజుకు 375 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నారు. కాగా ఇప్పటికే ఇండియాలో 4, 234 కరోనా బాధితుల సంఖ్య ఉండగా ఇందులో 321 మంది కోలుకున్నారు, 3,084 యాక్టివ్ కేసుల సంఖ్య ఉన్నది. 116 మంది కరోనాతో మృతిచెందారు.