YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి

 ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి

 ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి
వరంగల్ అర్బన్ ఏప్రిల్ 6 
కరోనా వైరస్ వ్యాప్తి  కట్టడి నేపథ్యం లో జిల్లాలోని  ప్రవేటు హాస్పిటల్  యాజమానులు ప్రభుత్వం నిబంధనలు సూచనలు తప్పనిసరిగా పాటించాలని  జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు  కోవిద  19   దృష్ట్యా అత్యవసరమైనవి మినహా  ఏవి ఆపరేషన్లు చేయరాదు.  శ్వాశ కోశ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఓ పి  ఏర్పాటు చేయాలని అయన అన్నారు. కోవిద్  19  నిర్ధారణ కొరకు  అనుమానిత కేసులను గుర్తించడానికి  కో విడ్ 19  కేంద్రాలను  ప్రతి హాస్పిటల్ లో ఏర్పాటు చేయాలని అని అన్నారు. నిర్ధారణ కేంద్రాల్లో  విదేశాల  నుండి వచ్చిన వారి వివరాలు రిజిస్ట్రార్ లో తప్పని సారిగా నమోదు చేయాలి. కోవిడ్  19    కేసుల కోసం ప్రతి హాస్పిటల్ లో  ప్రత్యేక మైన ఐ సోలేశన్ వార్డు లు గదులు ఏర్పాటు చేయాలని అన్నారు.   ప్రభుత్వం తరుపున జిల్లా యంత్రాంగం జారీ చేసిన సూచనలు  ప్రవేటు హాస్పిటల్  యాజమాన్యం సహకరిస్తారని   ఆశి స్తున్నట్లు  అన్నారు. శ్వాశ కోశ లక్షణాలున్న వారి వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,  జిల్లా   సర్వే లెన్స్ అధికారి కి తప్పని సరిగా తెలియజేయాలని కలెక్టర్ కోరారు. తీవ్ర శ్వాశకోశ  లక్షణాలు  లేదా నియో నియాతో  బాధ పడే    వివరాలు  సంబంధిత నమూనా లో  ప్రతి రోజూ సాయంత్రం అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ విపత్కర పరిస్తితి ల్లో తమ  వంతు  వంతు బాధ్యత గా గుర్తెరిగి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Related Posts