YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ప్రతి నిమిషానికి నలుగురు మృతి

ప్రతి నిమిషానికి నలుగురు మృతి

ప్రతి నిమిషానికి నలుగురు మృతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 70 వేలు దాటింది. ఇటలీ, స్పెయిన్‌లలో కోవిడ్ కాస్త నెమ్మదించినప్పటికీ.. 40 గంటల్లోపే పది వేల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 16 వేలకు చేరువలో ఉండగా.. స్పెయిన్‌లో 13 వేల మందికి పైగా కోవిడ్‌కు బలయ్యారు. దానికి పొరుగున ఉన్న ఫ్రాన్స్‌లోనూ కోవిడ్ మరణాల సంఖ్య 8 వేలు దాటగా.. బాధితుల సంఖ్య 93 వేలకు చేరువలో ఉంది. కరోనా కేసుల సంఖ్య పరంగా చూస్తే.. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలు చైనాను దాటేయగా.. ఫ్రాన్స్‌, జర్మనీ కూడా డ్రాగన్‌ను అధిగమించాయి. జర్మనీలోనూ కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటగా.. అక్కడ 1584 మంది చనిపోయారు. మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే ఇక్కడ ప్రాణ నష్టం తక్కువగా ఉంటోంది.మరోవైపు బ్రిటన్లోనూ కోవిడ్ మహమ్మారి భారీగా ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇక్కడ కరోనా మృతుల సంఖ్య ఐదు వేలకు చేరువలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న అమెరికాలో కోవిడ్ బాధితుల సంఖ్య 3.37 లక్షలుగా ఉండగా.. మరణాల సంఖ్య పది వేలకు (9620) లకు చేరువగా ఉంది.భారత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మన దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 4 వేలు దాటగా.. మృతుల సంఖ్య 100 దాటింది.

Related Posts