YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

టీశాట్ తో మ్యాధ్స్ నేర్పించండి

టీశాట్ తో మ్యాధ్స్ నేర్పించండి

టీశాట్ తో మ్యాధ్స్ నేర్పించండి
హైద్రాబాద్, ఏప్రిల్ 6 
లాక్ డౌన్‌తో చిన్నా చితక, ముసలి ముతక అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకూడదని నిబంధనలు ఉండటంతో అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే చాలా పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు కూడా ఇళ్లలోనే ఉంటూ పరీక్షల కోసం వేచి చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఓ అద్భుతమైన సలహా ఇచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్. లాక్ డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లితండ్రులకు ఈ మేరకు ఆయన సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చన్నారు. పోటీ పరీక్షలకు విద్యార్థులంతా సిద్ధం కావచ్చని ట్వీట్ ద్వారా కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్స్ అంతా స్పందిస్తున్నారు. మంచి సలహా, గ్రేట్ ఐడియా అంటూ బదులు ఇస్తున్నారు.టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల  ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కడివారైనా సరే తనకు సాయం కోరుతూ చేసిన ట్వీట్లకు కేటీఆర్ స్పందిస్తుంటారు. అందుకే నిత్యం వందలాదిమంది కేటీఆర్‌ను హెల్ప్ కోరుతూ మెసేజులు పెడుతుంటారు. లాక్ డౌన్ వేళ ఈ మెసేజులు మరింత ఎక్కువయ్యాయి. వాటిన్నింటికి ఓర్పుగా బదులు ఇస్తుంటారు కేటీఆర్. వారివారి సమస్యల్ని తీరుస్తుంటారు.మరోవైపు తెలంగాణలో కూడా ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ నడుస్తోంది. అయితే తెలంగాణలో రోజురోజకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసులు 300 దాటాయి. 11 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల విషయంలో తెలంగాణ నాలుగోస్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. లాక్ డౌన్ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Related Posts