YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కరోనా దెబ్బకు కుదేలు..

కరోనా దెబ్బకు కుదేలు..


కరోనా దెబ్బకు కుదేలు.. (ఖమ్మం)
ఖమ్మం, ఏప్రిల్ 07 (న్యూస్ పల్స్): కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమను ఢీ కొట్టింది. రెండు నెలలుగా పరిశ్రమ కుదేలవడంతో ఇప్పటి వరకు రూ.200 కోట్ల వ్యాపారం నిలిచిపోయింది. గ్రానైట్‌ క్వారీల్లో ముడి రాళ్లు కొనుగోలు చేసే బయ్యర్లు చైనా నుంచి ఖమ్మం వస్తుంటారు. రెండు నెలలుగా వాళ్లు రాకపోవడంతో క్వారీల నుంచి వెలికి తీసే గ్రానైట్‌ ముడి రాళ్లు చైనాకు ఎగుమతి నిలిచిపోయింది. క్వారీల నుంచి వెలికి తీసిన ముడి రాళ్లను గ్రానైట్‌ పలకలుగా కోసే పరిశ్రమలు పూర్వ ఖమ్మం జిల్లాలో 800 వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమలో కోత కోసి, పాలిష్‌ పట్టిన గ్రానైట్‌ పలకలను రాజస్థాన్‌, గుజరాత్‌, దిల్లీ, ముంబయి, నాగ్‌పూర్‌, కర్ణాటక ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు గ్రానైట్‌ పలకలను ఇక్కడ కొనుగోలు చేసి లారీల్లో తరలిస్తుంటారు.ఈ పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 50 వేల మంది వరకు పనిచేస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూత పడింది. ఎప్పటికి తెరుచుకుంటుందో తెలియదు.  పూర్వ ఖమ్మం జిల్లాలో 150కు పైగా గ్రానైట్‌ క్వారీలున్నాయి. వాటి నుంచి ముడి రాళ్లను వెలికి తీసి నాణ్యమైనవి చైనాకు ఎగుమతి చేస్తారు. క్వారీల్లో కొనుగోలు చేసిన ముడి రాళ్లను పెద్ద ట్రాలీల్లో కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై ఓడ రేవులకు రోడ్డు మార్గంలో రవాణా చేస్తారు. అక్కడి నుంచి ముడి రాళ్లను ఓడల్లో చైనాకు తరలిస్తారు. లాక్‌డౌన్‌ వల్ల ఖమ్మం నుంచి అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ప్రయాణించే గ్రానైట్‌ ముడిరాళ్లు తరలించే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముడి రాళ్లను గ్రానైట్‌ పలకలుగా కోత కోసి పాలిష్‌ పట్టే పరిశ్రమ నుంచి రోజుకు రూ.3 కోట్ల పైగా వ్యాపారం సాగుతుంటుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. విక్రయానికి సిద్ధంగా ఉన్న సరుకు కొనుగోలు చేసేవారు వచ్చేఅవకాశం లేదు. ఇప్పటికే నిల్వలు పేరుకుపోయాయి. యాజమాన్యాలు కార్మికులను భరించలేని పరిస్థితి  ఎదుర్కొంటున్నాయి. మొత్తం మీద గ్రానైట్‌ పరిశ్రమ సంక్షోభంలోకి   నెట్టబడింది. ఒక వైపు చైనాకు జిల్లా నుంచి గ్రానైట్‌ ముడిరాళ్లు తరలిస్తూ... గ్రానైట్‌ క్వారీల్లో ఉపయోగించే యంత్రాల విడి భాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రెండు నెలలుగా యంత్రాల విడిభాగాల దిగుమతి చైనా నుంచి నిలిచిపోయింది. క్వారీల్లో ముడి రాళ్లు తవ్వి, కచ్చితంగా కోత కోసి వెలికి తీసేందుకు భారీ యంత్రాలు, క్రేన్లు, డోజర్లు, డంపర్లు వాడుతుంటారు. అవన్నీ రెండు నెలలుగా రావడంలేదు

Related Posts