YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొత్త ప్యాకేజీతో ఇండియా

కొత్త ప్యాకేజీతో ఇండియా

కొత్త ప్యాకేజీతో ఇండియా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కోవిడ్ 19 వల్ల ఇప్పటికే భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు మోదీ సర్కార్ ఇటీవల రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది.అయితే ఈ ప్యాకేజీ వల్ల ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు అప్పుడే అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలనే యోచనలో ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెండో రిలీఫ్ ప్యాకేజ్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తొలి ప్యాకేజీలో ప్రజలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.అయితే ఈసారి ప్యాకేజీలో కరోనా వైరస్ వల్ల దెబ్బతిన రంగాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోనుంది. ఆయా రంగాలకు ఉద్దీపన ప్యాకేజీ అందించొచ్చు. వచ్చే కొన్ని రోజుల్లో ప్రభుత్వం రంగాలకు ఉపశమనం కలిగించే ప్యాకేజీని ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.రంగాలకు మాత్రమే ఉపశమనం కలిగించే నిర్ణయాలు మాత్రమే కాకుండా ప్రభుత్వం రెండో ఆర్థిక ప్యాకేజీలోనూ ప్రజలకు ప్రయోజనం కలిగించే చర్యలు ప్రకటించొచ్చు. ముఖ్యంగా పేద ప్రజలు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఏర్పాటు చేసిన ఒక కమిటీతో ఆర్థిక శాఖ ఈ అంశంపై ఆలోచిస్తోంది.వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హాస్పిటాలిటీ, పౌర విమానయనం వంటి రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగిస్తుందా? లేదా? అనే అంశం ఎవ్వరికీ తెలీదు. లాక్ డౌన్ పొడిగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పొడిగించకపోతే కరోనా వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదముంది

Related Posts