YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఐసీయూలో బ్రిటన్ పీఎం

ఐసీయూలో బ్రిటన్ పీఎం

ఐసీయూలో బ్రిటన్ పీఎం
లండన్, ఏప్రిల్ 7
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు దెబ్బ తగిలింది. బోరిస్‌‌కు వైరస్ తీవ్రత పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.. కానీ వైరస్‌ లక్షణాలు ఉండటం, తీవ్రత పెరగడంతో వ్యక్తిగత వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో.. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి.. ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. బోరిస్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.గురువారం జాన్సన్‌కు కరోనా పాజిటివ్‌ తేలడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని డాక్టర్లు సూచించారు.. కానీ పరిస్థితుల్ని గమనించిన ఆయన ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలు ఉండటంతో.. నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్లు ఆయన చెప్పారు.. ఓ వీడియో ద్వారా సందేశం పంపారు. తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తైందన్నారు. కానీ వైరస్ లక్షణాలు ఉన్నాయి.. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నాయని తేలిందన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తగ్గేవరకు తాను స్వీయ నిర్బంధంలో ఉంటాను అన్నారు జాన్సన్‌

Related Posts