YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరొన వైరస్ను తరిమికొట్టాలి

కరొన వైరస్ను తరిమికొట్టాలి

కరొన వైరస్ను తరిమికొట్టాలి
 మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి ఏప్రిల్ 7
కరోనా మహమ్మారిని ప్రజలు తరిమి కొట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో విలేకరులతో మాట్లాడారు లాక్ డౌన్ ను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు కరోనా ను కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు ఇదే స్ఫూర్తితో ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు మనకోసం కుటుంబం కోసం సమాజం కోసం భౌతిక దూరాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు బియ్యం రూ 500 చొప్పున నగదు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు గ్రామాల్లో నీ పేద ప్రజలకు ఆర్థికంగా ఉన్న వారు తమకు వచ్చే రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు 52 శెనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైతులు ఈ కేంద్రాలను వినియోగించుకొని గిట్టుబాటు ధర పొందాలని పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులు 15 రోజులకు సరిపడా జిల్లాలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు రూ 5లక్షల నగదును జిల్లా తెరాస నాయకులు కార్యకర్తలు అందజేసినట్లు మంత్రి చెప్పారు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి ఇతరులకు ఒక్కరికి కూడా  వ్యాధి సంక్రమించ లేదని స్పష్టం చేశారు . బాన్సువాడ లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు . ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని అన్ని విధాల ప్రభుత్వమే ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఎస్పీ శ్వేత అదనపు కలెక్టర్ లు యాదిరెడ్డి వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మునిసిపల్ చైర్ పర్సన్ జాహ్నవి ,ఆర్ డి ఓ రాజేంద్ర కుమార్ , డీఎస్పీ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ శైలజ , జిల్లా వైద్యాధికారి  చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Posts