YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనాపై సీఎస్ సమీక్ష

కరోనాపై సీఎస్ సమీక్ష

కరోనాపై సీఎస్ సమీక్ష
విజయవాడ, ఏప్రిల్ 7
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నివారణా చర్యలు, కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని సమీక్షించారని కోవిడ్-19,రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ( మీడియా మేనేజ్మెంట్) సభ్యులు,  ఐ అండ్ పిఆర్ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సిఎస్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కరోనా వైద్య పరీక్షా ఫలితాలు త్వరితంగా వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పరీక్షా ప్రయోగశాలల గురించి తెలియజేయాలని అన్నారు.  స్వీయ నిర్భంధం మరియు గృహ నిర్భంధం పై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సిఎస్ ఆదేశించారని మరియు లాక్ డౌన్ వ్యవధిని ఎత్తివేసిన తర్వాత వైరస్ ను నియంత్రించడానికి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండే విధంగా ప్రచారం కల్పించాలని సూచించారన్నారు.     కరోనా పాజిటివ్ వ్యక్తుల వద్దకు  65 సంవత్సరముల పైబడిన వారు వెళ్లకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని, అంతేకాకుండా తమను తాము రక్షించుకుంటూ, చుట్టుపక్కల ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోకుండా వారి వద్దకు వచ్చే అవకాశం ఉందని అలాంటి వారిపట్ల స్వీయ నిర్భంధం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని శ్రీమతి నీలం సాహ్నీ ఆదేశించారని అన్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారి దగ్గరకు డయాబెటిస్/ఉబ్బసం  రోగులు వెళ్ళకుండా చూసుకోవాలని ఆమె ఆదేశించారని అన్నారు. స్వీయ ఐసోలేషన్ ను ఖచ్చితంగా పాటించాలని, కంటైన్మెంట్ జోన్ / రెడ్ జోన్ / హాట్ స్పాట్లకు వెళ్లకుండా ఐసోలేషన్ ,  స్వీయ నిర్భంధం పద్ధతులను అనుసరించాలని,  కరోనా  వైరస్ పై అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపిన విధంగా వ్యవహరించడం ద్వారా ప్రజలు కోవిడ్-19 గురించి మరింత జాగ్రత్తగా మసలుకోవచ్చని తెలిపారన్నారు. జీవో 226 లో నిర్దేశించిన ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ పాటిస్తూ, సామాజిక దూరం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం తదితర చర్యలు తీసుకోవాలని మేడమ్ సిఎస్ ఆదేశించారని అంతేకాకుండా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మరియు ద్వితీయ థీమ్స్ గా తెలిపిన ప్రకారంగా మరియు భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన అత్యంత ప్రజాధరణ పొందిన ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించటం ద్వారా కరోనా కి అడ్డుకట్ట వేయొచ్చని  తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో తెలియజేశారు.

Related Posts