కడపలో యదేఛ్చగ మద్యం అమ్మకాలు
కడప, ఏప్రిల్ 7
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కంచుకోటైన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు బార్ల యజమానులు జోరుగు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ అవుతున్న నేపథ్యంలో వారు మద్యం అమ్మకాలు ఎలా జరుపుతున్నారని ఎక్సై జ్ అధికారులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వస్తున్నా ప్రజల ఆరోగ్యం కోసం జగన్ సర్కార్ మద్యం అమ్మకాలను నిలిపివేసిందన్నారు.అయితే కొంత మంది ధరలు దారుణంగా పెంచి అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు. దీనికి సంబంధించి తమ వద్ద రుజువులు ఉన్నాయన్నారు. ఓ బార్ యజమాని లాక్‌డౌన్ సమయంలో రూ. 10 లక్షలు ఆర్జించినట్లు తెలిసిందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోవడం దారుణమన్నారు.కోగటంలో సైతం మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. రామేశ్వరంలో రోజూ సాయంత్రం గుంపులుగుంపులుగా చేరుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో నిరోధించకపోతే ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేస్తానని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపాల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శానిటైజర్లను పంపిణీ చేశారు.