ఏప్రిల్ 7 నుంచి IPL-11 సీజన్ ప్రారభం కానుంది.ఈ సందర్బముగా ముంబై లో ఓపెనింగ్ సెర్మనీ బీసీసీఐ ఘనంగా ఏర్పాటు చేసింది .ఈ కార్యక్రమంలో సందడి చేయడానికి బాలీవుడ్ కధానాయకుడు రణవీర్ సింగ్ ని అనుకున్న విషయం అందరికి తెలిసిందే .కానీ కొన్నికారణాలు చేత ఆఖరి నిముషంలో ఈ ఛాన్స్ మిల్కీ బ్యూటీ తమన్నా కి దక్కింది. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఆమె భారీగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ చెన్నై తో ముంబై తలపడనుంది.