YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బాలయ్యకు పట్టని నియోజకవర్గం

 బాలయ్యకు పట్టని నియోజకవర్గం

 బాలయ్యకు పట్టని నియోజకవర్గం
అనంతపురం, ఏప్రిల్ 8
మామూలుగానే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి పెద్దగా రారు. ఇక కరోనా విజృంభిస్తున్న తరుణంలో నియోజకవర్గానికి వచ్చే అవకాశమే లేదు. దీంతో బాలకృష్ణ తన సొంత నిధులు వెచ్చించి కొంత సాయం అందిస్తున్నప్పటికీ విమర్శలు ఎదుర్కొనడంలో ముందుంటున్నారు. కఠిన సమయాల్లోనే ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలి. దాదాపు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. మంత్రులు కొందరు తప్పించి టీడీపీ, వైసీపీ, జనసేన ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంలోనే ఉండి దగ్గరుండి సేవలను అందిస్తున్నారు.నియోజకవర్గంలో పేదలకు భోజన సౌకర్యాలు, మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి వివిధ ప్రాంతాల్లో శానిటైజ్ చేయడం వంటి వి దగ్గరుండి చేయిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం దగ్గరుండి రేషన్, ప్రభుత్వం పంపిణీ చేసే నగదు కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో లాక్ అయిపోయారు.హిందూపురం నుంచి బాలకృష్ణ వరసగా గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ హవా ఎక్కువగా ఉన్నప్పటికీ అనంతపురం జిల్లాలో గెలిచిన రెండు స్థానాల్లో హిందూపురం ఒకటి. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. పీఏలదే పెత్తనమంటూ సొంత పార్టీ నేతలే ధ్వజమెత్తారు. బాలకృష్ణ కన్పించడం లేదంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా 2019 ఎన్నికల్లో బాలయ్య బాబు విజయం సాధించారు.కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో హిందూపురంను బాలకృష్ణ పూర్తిగా వదిలేశారంటున్నారు. బాలకృష్ణ నియోజకవర్గానికి వచ్చి నెలలు దాటుతోంది. నియోజకవర్గంలో కరోనా కేసులు నమోదవుతున్నా బాలకృష్ణ పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే బాలకృష్ణ మాత్రం హైదారాబాద్ లోనే ఉండి తన అనుచరుల చేత కూరగాయలు, టిఫిన్లు పంపిణీ చేయిస్తున్నారు. తమకు ఎమ్మెల్యే ఉన్నా లేనట్లేనని హిందూపురం వాసులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సినిమాల మీద ఉన్న శ్రద్థ నియోజకవర్గంపై లేదంటున్నారు.

Related Posts