పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాణిక్యాలరావు మాటలతో స్పష్టమైందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ఎవరైనా మా పార్టీ బలంగా ఉందంటారు కానీ.. పవన్ బలంగా ఉన్నారని ఎలా చెబుతారని అయన అన్నారు. ముద్రగడ వెనుక ఎంత మంది కాపులున్నారో పవన్ వెనుకా అంతే మంది కాపులున్నారు. ఏపీలో ఉండాల్సిన పవన్ ఏపీలో రెండు రోజుల టూర్ పెట్టుకోవడం ఏమిటని నిలదీసారు. బుధవారం నాడు మరో మత్రి కళా వెంకట్రావుతో కలసి అయన మీడియాతో మాట్లాడారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడుతున్నారు.. మేం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాంమని చినరాజప్ప అన్నారు. మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ పవన్ స్ధిరత్వం లేని మనిషని తేలిపోయింది. పేదలు, రైతులు ప్రభుత్వ పని తీరుతో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఎంత మంది కలిసి పోటీ చేసినా.. విడివిడిగా పోటీ చేసినా టీడీపీకి ఇబ్బంది ఉండదని అన్నారు.