YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

హనుమాన్ జయంతి  పూజా విధి*

హనుమాన్ జయంతి  పూజా విధి*

హనుమాన్ జయంతి  పూజా విధి*
*హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి?*
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో *హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర* వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం. హనుమంతుడి పుట్టినరోజు హనుమాన్ జయంతి కోసం ఊరేగింపులో భక్తులు పాల్గొంటారు. హనుమాన్ జయంతి 2020 ఏప్రిల్ 8 న జరుపుకుంటారు. మారుతి, పవన్‌పుత్రా, కేసరి నందన్ మరియు బజరంగ్ బలి అని కూడా పిలువబడే హనుమంతుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. హిందూ విశ్వాసాల ప్రకారం, హనుమంతుడు శక్తి మరియు బలానికి ప్రతీక, మరియు ప్రజలు అన్ని చెడులను నివారించడానికి ఆయనను ఆరాధిస్తారు.సాధారణంగా ఏప్రిల్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున చైత్ర మాసంలో హనుమాన్ జయంతిని ఆచరిస్తారు.
*హనుమాన్ జయంతి తేదీ మరియు సమయం*
పూర్ణిమ తిథి ఏప్రిల్ 7 న మధ్యాహ్నం 12.07 నుండి ప్రారంభమై ఏప్రిల్ 8 న ఉదయం 8.04 గంటలకు ముగుస్తుంది.
జ్ఞానం మీ ఆలోచనలను శాసించనివ్వండి మరియు మీ శక్తిని మంచి ఉపయోగం కోసం ఉపయోగించుకోండి.
హనుమాన్ జయంతి యొక్క ఈ శుభ సందర్భంగా పవన పుత్ర హనుమంతుడిని ప్రార్థిద్దాం మరియు మన జీవితంలో విజయవంతం కావడానికి ఆయన ఆశీర్వాదం కోరుకుందాం. మీకు మరియు మీ కుటుంబానికి హనుమాన్ జయంతిపై ఆనందం, సామరస్యం మరియు సమృద్ధిని కోరుకుంటున్నాను. జ్ఞానం మీ ఆలోచనలను శాసింపజేయండి. మీ ఆశలు నెరవేరనివ్వండి. మీ శక్తిని మంచి ఉపయోగంలోకి తెచ్చుకోండి.
హనుమాన్ జయంతి 2020 శుభాకాంక్షలు! 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts