సమ్మర్ దొంగతనాలు.. జరాభద్రమంటున్న పోలీసులు
మెదక్, ఏప్రిల్ 8,
వేసవి కాలం.. పెరిగిన ఎండలు.. పిల్లలకు సెలవులుండటంతో చలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం చూపుతారు. వేసవిలో ఇండ్లను కొల్లగొట్టి దోపిడీలకు తెగబడుతుంటారు. పోలీసులు దొంగతనాలు నివారించేందుకు సాంకేతికంగా ఎటువంటి కారణాలు లేకున్నా పలు అంశాలను పోలీసుల పరిశోధన చేస్తున్నారు. వేసవి వేళల్లో చల్లదనం కోసం మే డలపై నిద్రించే ఆలవాటున్న కుటుంబ సభ్యులు ఇం డ్లకు తాళలు వేసి నిద్రించడం దొంగలకు కలిసొచ్చే అంశం. అపరిచితులు, అనుమానితులు మాట కలిపి వివరాలను సేకరించి పట్టపగలే పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడిన సంఘటనలు పోలీసుల విచారణలో తేలిన సంఘటనలు ఉన్నాయి.వేసవి వచ్చిందంటే చాలు దొంగల భయం. తాళం వేసిన ఇళ్లు, ఇళ్ల ముందు, బస్‌స్టేషన్‌లు, పార్కులు, గార్డెన్స్, కళాశాలలు, షాపులు ముందు నిలిపిన వాహనాలు చోరీకి గురయ్యాయనే ఘటనల గురించి వింటుంటాం. ఇంకా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంధువుల్లా కలిసిపోయి దృష్టిమరల్చి దొంగతనాలకు పాల్పడుతారు కొంతమంది చోరులు. చైన్ స్నాచింగ్‌లు జరుగుతాయి. కిటికీల్లోంచి నీళ్లు చల్లి బయటకు రాగానే దోచేస్తారు. ఇంకా డాబాలు, ఆరుబయట చల్లగాలికి పడుకున్న వారి ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకావాశాలు ఎక్కువగా ఉంటాయి. పగటి వేళల్లో కాలనీల్లో చిరువ్యాపారులు, సేల్స్ ప్రమోటర్స్‌లా పర్యటిస్తూ రెక్కి నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతారు అటువంటి వారిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండలని పోలీసులు సూచించడం జరుగుతుంది.దొంగతనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. టూర్లకు, ఊర్లకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి.తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు.ఇంటి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. దూర ప్రాంతాలకు, ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు తప్పకుండా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలి.అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు.బంగారాన్ని మెరుగు పెడతామని చెప్పేవారిని నమ్మొద్దు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే మెడచుట్టూ కొంగును, ప్రత్యేక వస్త్రంతో కనిపించకుండా ఉంచాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హాండిల్‌లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.