ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లాండ్ రోవర్ భారత్‌లో కొత్త మోడల్ కారును విడుదల చేసింది. రేంజ్ రోవర్ వెలార్ మోడల్‌ను కంపెనీ ఇక్కడ అధికారికంగా ప్రవేశపెట్టింది. వెలార్ మోడల్ ధర రూ.78.83లక్షలు. డిసెంబర్ నంచే దీనికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేంజ్ రోవర్ ఫ్యామిలీలో ఇది నాలుగో ఎస్‌యూవీ. ఇది బీఎండబ్ల్యు ఎక్స్5, ఆడి క్యూ7, వోల్వో ఎక్స్‌సీ90 తరహాలో ఉంటుంది. వెలార్ మోడల్ కారు 2లీటర్ల డీజిల్ ఇంజిన్ 178బీహెచ్‌పీ/430ఎన్ఎం లేదా 237బీహెచ్‌పీ/500ఎన్‌ఎం ఫీచర్లతో ఉంది. 3లీటర్ల డీజిల్ ఇంజిన్ 296బీహెచ్‌పీ/700ఎన్‌ఎం కలిగి ఉంది. అలాగే 2లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌కు 247బీహెచ్‌పీ/365ఎన్ఎం లేదా 296బీహెచ్‌పీ/400ఎన్ఎం ఉంది. 3లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌కు 375బీహెచ్‌పీ/450ఎన్‌ఎం ఫీచర్ ఉంటుంది. అన్ని ఇంజిన్లకు జెడ్‌ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది.