YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం

లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం

లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం
హైదరాబాద్  ఏప్రిల్ 8 
ఈనెల 14 న ముగియనున్న లాక్ డౌన్ ను మరింత పొడిగింపును పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.   రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి. ప్రజలు లాక్ డౌన్ కి  సహకరించాలి. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ప్రజలెవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అనవసరపు కారణాలతో రోడ్లపైకి రావద్దని అయన సూచించారు. తాజా కూరగాయలు అవసరం లేదు. పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు పరుస్తుంది. దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదు..ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడి వారు అక్కడే ఉంటారు. విదేశాల నుంచి వచ్చిన వారు నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుందని అయన అన్నారు. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
 

Related Posts