YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు

వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు

వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
వరంగల్ ఏప్రిల్ 8 
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందానికి మంత్రులు ఎర్రబెల్లీ దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.  వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ లో కరోనా నిర్ములన, ధాన్యం, కొనుగోలు కేంద్రాలు, బియ్యం పంపిణీ, వలస కూలీల స్థితి గతుల పై మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో వరంగల్ అర్బన్ జిల్లాలో  23 మంది, జనగామ జిల్లాలో ఒక్కరికి, ములుగు జిల్లాలో ఇద్దరికీ, భూపాలపల్లి జిల్లాలో ఒక్కరికి  కోవిద్ 19 పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలిపారు. అధికారులు పోలీసులు బాగా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ కు ప్రజలు ఎంత సహకారిస్తే అంతవిజయవంతం అవుతుందన్నారు. రేపటి నుంచి లాల్ డౌన్ ను మరింత కఠినంగా  అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. పూర్వపు వరంగల్ జిల్లాలో 835 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి దయాకర్ రావు అన్నారు.  సీఎం మంత్రి సత్యవతి . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, సీపీ రవీందర్ పాల్గొన్నారు.
 

Related Posts