YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దద్దమ్మలు మాట్లాడుతున్నారు

దద్దమ్మలు మాట్లాడుతున్నారు

దద్దమ్మలు మాట్లాడుతున్నారు
హైదరాబాద్ ఏప్రిల్ 8 
సీఎం కేసీఆర్ కొరొనా నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.  ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల బెడ్స్ అందుబాటులో ఉంచామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి వలస జీవులు తెలంగాణలో 10 లక్షల మంది ఉన్నారు.  తెలంగాణ ప్రజలతో సమానంగా వలస జీవులకు నిత్యవసర సరుకులు అందిస్తున్నారు.  టీఆరెస్ ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని ఆహారం అందిస్తున్నారు.  వైద్యపరంగా  ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది.  ఇప్పటి వరకు 14 రోజులు క్వరంటాయిన్ లో ఉన్న వాళ్ళ డిచార్జ్ లు మొదలు అయ్యాయి.  నిత్యవసర సరుకుల సాకుతో కొంతమంది రోడ్లెక్కుతున్నారు. కొంతమంది దద్దమ్మలు గాలిమాటలు మాట్లాడుతున్నారని అయన విమర్శించారు. ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లనే సీఎం విమర్శలు చేసారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా కు ఇచ్చిన గౌరవం ఏంటో అందరికి తెలుసని అన్నారు. ప్రపంచ దేశాలు మెడిసిన్ ను ఇండియాను అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. విమర్శలు చేసే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు.  జ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుంది. మీడియాలో కనిపించాలనే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసారు. కాంగ్రెస్ నేతలు పనికిరాని దద్దమ్మలు మంచి సూచనలు సలహాలు ఇవ్వండి తీసుకుంటామని అన్నారు. కొంతమంది జూనియర్ వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బ్యాచ్ కొంతమంది జూనియర్ వైద్యులు మాత్రమే ముగ్గురు నలుగురు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే వైద్యులు మాత్రమే విమర్శలు చేస్తున్నారని అయన అన్నారు. యంత్రాంగం సరిగ్గా లేవని డోనేషన్ ఇచ్చే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్లకు ఇవ్వాలని స్టేట్ మెంట్ ఇచ్చారు. కొంత మంది మాత్రమే యంత్ర పరికరాలు లేవని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎం జరుగుతుందో కాంగ్రెస్ నేతలు తెలుసుకొని మాట్లాడాలి. మర్కజ్ వెళ్లిన వాళ్ళను 24 గంటల్లోనే పట్టుకున్నారు. భాప్రజలు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదు.  ప్రతిపక్షాలు అంటే మాకూ గౌరవమేనని మంత్రి అన్నారు.
 

Related Posts