గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ పేపర్ వర్క్ కాకుండా గ్రౌండ్ వర్క్ చేసి క్షేత్ర పరిస్థితులకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ పై లీ కంపెనీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ పూర్తిగా విన్నారు. వరంగల్ జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఈనెల 10న ఉప ముఖ్యమంత్రి కడియం ఆధ్వర్యంలో సమావేశమవుతామన్నారు. ఈ నెల 15 కు మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అనంతరం 45 రోజుల పాటు సలహాలు సూచనలు సీకరించనున్నారు.కూడా లో జరుగుతున్న రివ్యూ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తో పాటు జిల్లా నాయకులు , అధికారులు పాల్గొన్నారు. తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కూడాలో 3 గంటల పాటు రివ్యూ చేశాం. వరంగల్ ను అన్ని విధాలుగా దృష్టిలో వుంచుకుని మాస్టర్ ప్లాన్ వుంటుందని అన్నారు. వరంగల్ లో ఇన్నర్ రోడ్డు వుండాలని లీ కంపెనీ ప్రపోజల్ పెట్టారు. కూడా చెరువుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని అయన అన్నారు. కూడా భూములను పరిరక్షిస్తాం. ఏల్ఆర్ఏస్ పై త్వరలో స్పష్టత వస్తుంది. మామునూర్ ఏయిర్ పోర్ట్ ను త్వరలో పునరుద్ధరిస్తామని మంత్రి హమినిచ్చారు. వరంగల్ లో సమగ్ర రవాణ సర్వే చేస్తాం. పట్టణం చుట్టూ 5 వందల ఎకరాలలో టౌన్షిప్ డెవలప్ చేస్తాం. జూన్ 15 కల్లా మాస్టర్ ప్లాన్ పూర్తిచేస్తామని అన్నారు.