ధరల నియంత్రణకు కేంద్రం కొత్త ఆదేశాలు
న్యూఢిల్లీ ఏప్రిల్ 8
లాక్ డౌన్ పీరియడ్ లో నిత్యావసరాలు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో... లాక్ డౌన్ పీరియడ్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలను ఎలా నియంత్రించాలో రాష్ట్రాలకు సూచనలు చేసింది కేంద్రం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా బుధవారం లేఖ రాశారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టు 1955ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా నిత్యావసరాల ధరలను నియంత్రించాలంటూ సదరు చట్టంలోని కీలక పాయింట్లను ఉటంకించారు అజయ్ కుమార్ భల్లా. ఆ కీలక పాయింట్లను కచ్చితంగా అమలు చేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు సరసమైన, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు నిత్యావసరాలు దొరికేలా చూడొచ్చని ఆయన ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ను ప్రారంభించడం ద్వారా ప్రజలకు అవసరమైన వస్తువుల లభ్యతను నిర్దారించవచ్చన్న హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెటింగ్ ను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన వస్తువులను సరసమైన ధరలకు లభించేలా చూడాలని ఆయన ఆదేశించారు.