YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

14 నుంచి 15 జిల్లాలు దిగ్భంధనం

14 నుంచి 15 జిల్లాలు దిగ్భంధనం

14 నుంచి 15 జిల్లాలు దిగ్భంధనం
ల క్నో, ఏప్రిల్ 8
దేశంలో కరోనా వైరస్‌ కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికే హాట్‌స్పాట్‌లను కేంద్రం గుర్తించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో ఈ హాట్‌స్పాట్‌లు ఉన్నట్టు గుర్తించారు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నాయి. హాట్‌స్పాట్‌లలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుంటంతో ఉత్తప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణే లక్ష్యంగా లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 14 వరకు మొత్తం 15 జిల్లాలను పూర్తిగా దిగ్బంధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.లక్నో, ఘజియాబాద్‌, నొయిడా, ఆగ్రా, షాల్మీ, కాన్పూర్, వారణాసి, బరేలీ, సీతాపూర్, బులంద్‌షహర్, మీరల్, మహరాజ్‌గంజ్, ఫిరోజాబాద్, బస్తీ, షహారన్‌పూర్ ఈ 15 జిల్లాలను పూర్తిగా దిగ్బంధించి, నిత్యావసరాలను ప్రజల ఇళ్లకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చూడలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాత్రి నుంచి ఉదయం వరకూ కర్ఫ్యూ కొనసాగుతుండగా.. ఉదయం వేళ నిత్యావసరాల కొనుగోలు కోసం కొద్ది సమయం ఇస్తున్నారు. తాజాగా, ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు, తెలంగాణలోనూ 100కుపైగా కరోనా క్లస్టర్లను గుర్తించినట్లు సమాచారం. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసినా రాష్ట్రంలో కోవిడ్ 19 సంపూర్ణ నియంత్రణ కోసం ఈ జోన్లలో మాత్రం నిర్బంధం పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిత్యావసర సరుకుల కోసం కూడా ఈ ప్రాంతాలలో జన సంచారాన్ని అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ప్రభుత్వమే సరుకులను ఇంటింటికీ సరఫరా చేసే వ్యూహరచనలో ఉన్నట్లు వినికిడి. లాక్‌డౌన్ కొనసాగుతుండగా... సాయంత్రం నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఎక్కడికక్కడే తమ ఇళ్లలోనే ఉండిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి.

Related Posts