తెలంగాణ జన సమితి జెండాను అవిష్కరిస్తున్న ఐకాస చైర్మన్ కోదండరామ్ బుధవారం ఆవిష్కరించారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగు, మధ్యలో నీలి రంగులో తెలంగాణ చిత్రపటం, దాని నడుమ అమరవీరుల స్థూపం వుండేలా రుపోందించారు. తెలంగాణ జన సమితి లోగో ను చింత స్వామి చేయగా, జెండాను రాజేష్ రూపోందించారు. జెండా గురించి కోదండరామ్ మాట్లాడుతూ పాలపిట్ట రంగు విజయానికి, ఆకుపచ్చరంగు అభివృద్ధి కి సూచికలన్నారు. చక్రం అమరుల వీరుల స్థూపం చుట్టు తిరుగుతున్నా జనం. ఎరుపు రంగు అమరుల ఆకాంక్ష. నీలి రంగు దళిత సమాజానికి ప్రతీక అని అయన అభివర్ణించారు. ప్రతి జిల్లాలో జెండా ఆవిష్కరించుకోవాలి. తెలంగాణ జన సమితి మడమ తిప్పేది లేదని అయన అన్నారు. మనందరం తెలంగాణ కోసం పోరాటం చేసాం. న్యాయం గూర్చి మాట్లాడితే అరెస్ట్ చేశారని విమర్శించారు. పుట్టగానే ఏవరు నాయకుడు కాదు. మేం సున్నా నుంచి మొదలు కాలేదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చామని అయన అన్నారు. మనం కోరుకున్నది తెలంగాణ సమాజం. ఈనెల 29 నా మన తడాఖా చూపిద్దాం. రాజకీయం, ఓట్లు ఏకం కావు. జీతాలు, వ్యవసాయం తో పాటు ఆత్మ గౌరవ తెలంగాణ కావాలని ప్రజలు కోరుతున్నారని అయన అన్నారు. మేము ఆశక్తులను కాదు. సర్వశక్తులమన్నారు