YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బిగ్‌ బజార్‌లో 1500కి పైగా నిత్యావసర వస్తువులు తక్కువ ధరే ...!!!

Highlights

  •   దేశవ్యాప్తంగా బిగ్ బజార్ షోరూమ్‌ల్లో ఈ స్కీమ్ అమలు
బిగ్‌ బజార్‌లో 1500కి పైగా నిత్యావసర వస్తువులు తక్కువ ధరే ...!!!

రిటైల్ మార్కెట్ చైన్ ‘బిగ్ బజార్’ రోజువారీ 1500కి పైగా వినియోగ వస్తువులను వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తోంది. ఏడాది పొడవునా బిగ్ బజార్ ఖాతాదారులు ఈ వసతిని సద్వినియోగం చేసుకోవచ్చు. నూతనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ‘హర్ దిన్ లోయెస్ట్ ప్రైస్’ స్కీమ్ శాశ్వత ఫీచర్‌గా కొనసాగనున్నది.రోజువారీ వినియోగ వస్తువులైన  నెయ్యి, చక్కెర, వంటనూనె, డిటర్జంట్ పౌడర్లు, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, షాంపూలు, టూత్ పేస్ట్, నూడిల్స్, ఆరోగ్య పానీయాలు, టీ, కాఫీ, బిస్కట్లు, సాస్ తదితర పలు వస్తువులు దేశంలోని 140 నగరాలకు పైగా గల అన్ని బిగ్ బజార్ స్టోర్లలో తక్కువ ధరలకే వినియోగదారులకు లభిస్తాయి. నూతన ధరలతో రోజువారీగా వినియోగించే అత్యవసర వస్తువులు అతి చౌక ధరకే అందుబాటులోకి రావడంతో వినియోగదారులు తమ డబ్బు తమ జేబుల్లోనే పెట్టుకోవచ్చు. భారతీయులందరి విశ్వసనీయమైన రిటైల్ షాప్ బిగ్ బజార్‌ను దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా కుటుంబాలు విశ్వసిస్తున్నాయి. ఈ స్కీమ్ వల్ల వారందరికీ లబ్ధి చేకూరనున్నది. రోజువారీ వినియోగించే 1500కి పైగా అన్ని రకాల వస్తువులపై ఆరు శాతం నుంచి 36% శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉన్నది. తద్వారా ప్రతి భారతీయ వినియోగదారుడు అదనంగా సుమారు రూ.2000 కోట్లు పొదుపు చేసుకునేందుకు వెసులుబాటు కలిగిస్తుంది. దేశంలోని ప్రతి సెక్షన్ వినియోగదారుడి రిటైల్ వస్తువుల కొనుగోలు కేంద్రంగా ఎదిగేందుకే బిగ్ బజార్ ఈ ‘హర్ దిన్ లోయెస్ట్ ప్రైస్’ కార్యక్రమం అమలుకు కట్టుబడి ఉన్నది. ప్రతిరోజూ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ తెలిపారు. తమ షోరూమ్‌లకు నూతన తరం వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 280 స్టోర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిగ్ బజార్.. ఇప్పటివరకు ఈజీ డే, హైపర్ సిటీ, హెరిటేజ్ ఫ్రెష్, నీల్ గిరీస్ తదితర రిటైల్ షోరూమ్‌లను స్వాధీనం చేసుకున్నది. ఒకవైపు సంఘటితమవుతూ మరోవైపు విస్తరణ దిశగా ఈ వ్యాపారం సాగుతున్నది. విస్తృత స్థాయిలో ప్రతిరోజు తక్కువ ధరలకు వస్తువులను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నది బిగ్ బజార్.

Related Posts