YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాంధ్రలో ఇంకా కష్టమేనా

ఉత్తరాంధ్రలో ఇంకా కష్టమేనా

ఉత్తరాంధ్రలో ఇంకా కష్టమేనా
విశాఖపట్టణం, ఏప్రిల్ 9  
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉత్తరాంధ్రా జిల్లాలు ఈసారి గట్టి షాక్ ఇచ్చాయి. మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన జిల్లాలు ఒక్కసారిగా సైకిల్ దిగిపోయాయి. మొత్తానికి మొత్తంగా ఫ్యాన్ పార్టీ వైపు వెళ్ళిపోయాయి. దాంతో ఎలాగైనా ఈ జిల్లాలలో పార్టీని పటిష్టం చేసుకోవాలని చంద్రబాబు ఎప్పటికపుడు వేస్తున్న వ్యూహాలు వరసగా బెడిసికొడుతున్నాయి. అన్నీ సరిగ్గా చూసుకుని చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వస్తే ఏకంగా విమానాశ్రయంలోనే వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబుని అటునుంచి అటే తిప్పి పంపారు. ఆ తరువాత లోకల్ బాడీ ఎన్నికలు అన్నారు. అవి కూడా వాయిదా పడ్డాయి. ఇక కరోనా వైరస్ ఒక్కసారిగా కోరలు చాచి దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు చివరి సారిగా గత ఏడాది నవంబర్లో ఉత్తరాంధ్రా జిల్లాల‌ టూర్ కి వచ్చారు. ఆనాడు ఆయన విశాఖ, శ్రీకాకుళం జిల్లాల సమీక్షలు నిర్వహించారు. ఆ తరువాత విజయనగరం సమీక్ష చేయాలనుకున్నా కుదరలేదు. ఇంతలో మూడు రాజధానుల గొడవ వచ్చింది. అప్పటి నుంచి అమరావతికి జై అంటూ చంద్రబాబు అక్కడే ఉండిపోయారు. ఇక అన్నీ చూసుకుని, ఓపికా, తీరికా చేసుకుని విజయనగరం జిల్లాకు రావాలనుకుంటే గో బ్యాక్ బాబు అంటూ వైసీపీ సర్కార్ ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసింది.ఇక చంద్రబాబు ఇప్పట్లో ఈ వైపుగా రావాలంటే అసలు కుదిరే పని కాదన్నది అందరికీ తెలిసిందే. ఇపుడు ఏపీలో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది. దాంతో లాక్ డౌన్ మరి కొంతకాలం అమలు చేయాల్సిన పరిస్థితి. ఇదంతా పూర్తి అయ్యేసరికి మరో నాలుగైదు నెలలు పడుతుంది. అంటే మరో ఆరు నెలల వరకూ చంద్రబాబు ఈ ప్రాంతానికి రావడం కుదిరే పని కాదని అంటున్నారు. ఓ విధంగా చంద్రబాబు పర్యటనలు మూడు జిల్లాలలో ఇప్పట్లో ఉండవని కూడా తమ్ముళ్ళు కుండబద్దలు కొడుతున్నారు.ఓ విధంగా చెప్పుకోవాలంటే ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా చంద్రబాబు కనీసం ప్రతీ మూడు నెలలకు ఒక మారు ఉత్తరాంధ్రా టూర్లు వేసేవారు. ఇక విపక్ష నేతగా ఆనాడు ఆయన ఈ ప్రాంతానికే తరచూ వచ్చేవారు. విభజన ఏపీలో కూడా ముఖ్యమంత్రిగా కనీసం నెలకు ఒకసారి అయినా ఉత్తరాంధ్రాలో పర్యటనలు పెట్టుకునే చంద్రబాబు దాదాపుగా ఏడాది పాటు ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూడకపోవడం అంటే అతి పెద్ద వింతే మరి. అది చంద్రబాబు కోరి తెచ్చుకున్నది కాదు, అలాగనీ చేసుకున్నదీ కాదు, అలా రాజకీయ కారణాలు, ఇతర విషయాలు, ఇపుడు కరోనా వైరస్ పుణ్యమాని బాబు తాను ఎంతో ఇష్టపడే ఉత్తరాంధ్రాకు దాదాపుగా ఏడాది పాటు దూరం పాటించాల్సివస్తోంది. ఓ విధంగా చంద్రబాబు రాక కోసం తమ్ముళ్ళు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు మరి అన్నీ అనుకూలిస్తే బాబు ఆగస్ట్ నాటికైనా ఉత్తరాంధ్రాలో అడుగుపెడతారని అంటున్నారు
 

Related Posts