దేశ రైతాంగానికి ఈ ఏడాది సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం కూడా ఉండదని స్కైమెట్ స్పష్టం చేసింది. స్కైమెట్ అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 55 శాతం సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల సాధారణం కంటే 20శాతం అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ వెల్లడించింది. ఇక తెలంగాణలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సగటున 887 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఇందులో 96 నుంచి 104 శాతం మేర వర్షాలు కురిస్తే దాన్ని సగటు వర్షపాతం అంటారు. 90 శాతానికి తగ్గితే లోటుగా భావిస్తారని స్కైమెట్ స్పష్టం చేసింది. 104-110 శాతం దాటితే దాన్ని అధిక వర్షపాతంగా పిలుస్తారు.