YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రాష్ట్రంలో బత్తాయి రైతుల బాధలు వర్ణణాతీతం

రాష్ట్రంలో బత్తాయి రైతుల బాధలు వర్ణణాతీతం

రాష్ట్రంలో బత్తాయి రైతుల బాధలు వర్ణణాతీతం
హైదరాబాద్ ఏప్రిల్ 9
రాష్ట్రంలో బత్తాయి రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.  దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో నష్టపోతున్న బత్తాయి, నిమ్మ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఇక్కడి బత్తాయి, నిమ్మ రైతులు ఇతర దేశాలకు ఎగుమతుల ద్వారా , అలాగే నాగపూర్ మరియు ఇతర రాష్ట్రల మార్కెట్ లలో అమ్మకునేవారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రవాణా చేయడం కష్టమవడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి బత్తాయి రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులతో సీఎం కేసీఆర్ చర్చించి గిట్టుబాటు ధర నిర్ణయించాలన్నారు. నాగపూర్ బత్తాయి మార్కెట్ లో ఉన్న గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ ను తట్టుకోవడానికి ప్రజలు బత్తాయి పండ్లు తినాలని సీఎం చెప్పారు. ప్రభుత్వం వెంటనే బత్తాయి పండ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సివిల్ సప్లై శాఖ ద్వారా పేద ప్రజలకు అందించాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఇలా చేస్తే ప్రజలకు ఆరోగ్యం , రైతులకు న్యాయం చేసిన వారువుతారు. రైతుల పండించిన బత్తాయి పండ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బత్తాయి, నిమ్మ పండ్లను అమ్ముకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. బత్తాయిలను సర్కారు నేరుగానైనా కొనాలని, లేదంటే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలి. వ్యవసాయం తరువాత అత్యధికంగా పండ్లతోటలపై ఆధారపడి జీవిస్తున్నా రైతులకు ప్రభుత్వం భరోసా కల్గించాలని అన్నారు.
==============

Related Posts