YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

విభజన వల్ల జరిగిన నష్టాన్నికేంద్రమే భర్తీ చేయాలి

Highlights

  • విభజన వల్ల జరిగిన నష్టాన్నికేంద్రమే భర్తీ చేయాలి
  • సాయం చేయాలని కోరేందుకు 29 సార్లు దిల్లీకి వచ్చా
  • ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం
  • ఇచ్చిన హమీలను కేంద్రం నెరవేర్చలేదు
  •  ఇప్పుడు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ అంటున్నారు
  • ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
విభజన వల్ల జరిగిన నష్టాన్నికేంద్రమే భర్తీ చేయాలి

ప్రత్యేక హోదా సాధన కోసం దిల్లీ బాట పట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ పార్టీల నేతలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో బుదవారం  సాయంత్రం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేతపత్రాలు విడుదల చేశా. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని కోరేందుకు 29 సార్లు దిల్లీకి వచ్చా. చిన్న చిన్న అంశాలు మినహా రాష్ట్రానికి పెద్దగా ఏమీ చేయలేదు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం. నాబార్డు ద్వారా నిధులు ఇస్తామన్నారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూశా. ఇచ్చిన హమీలను కేంద్రం నెరవేర్చలేదు. ఇప్పుడు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ అంటున్నారు. కేంద్రం తీరు చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విసుగెత్తిపోయారు. కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో లేఖ రాశా. కేంద్రం తీరు వల్ల ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీస సాయం చేయకుండా తిరిగి రాష్ట్రంపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రధానికి స్వయంగా ఫోన్‌ చేశా.. ఇప్పటికీ ఎన్డీయేలోనే ఉన్నాం.. న్యాయం చేయాలని కోరా. అయినా కేంద్రం వైఖరి ఏ మాత్రం మారలేదు. చివరిసారిగా అన్ని ప్రయత్నాలు చేశా. కేంద్రంతో కలిసి కొనసాగటం వల్ల ఉపయోగం లేదని భావించి ఎన్డీఏ నుంచి బయటికొచ్చాం.’’ అని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. తిరుపతి సభలో ప్రధాని మోడీ ఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందిస్తామని మోడీ చెప్పారని, కానీ ఆచరణలో వారు చేస్తున్నదేమిటని చంద్రబాబు విమర్శించారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అందుకే నిధులివ్వడం లేదంటున్నారు ఇదేనా కోపరేటివ్ ఫెడరలిజమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన వ్యయానికి సంబంధించి యూసీలన్నీ పంపించామని, వారు దానిని అంగీకరించారనీ, కానీ బయటకు యూసీలు అందలేంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నెల్లూరు, తిరుపతి సభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన ప్రకటన వీడియోను, అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని, అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను మీడియాకు చూపించారు.

Related Posts