YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో అంతకంతకు పెరుగుతోన్నమృతుల సంఖ్య

అమెరికాలో అంతకంతకు పెరుగుతోన్నమృతుల సంఖ్య

అమెరికాలో అంతకంతకు పెరుగుతోన్నమృతుల సంఖ్య
 ఒక్క రోజులో 1,900 మందికి పైగా మృతి  మృతదేహాలను ఉంచేందుకు సైతం దొరకని స్థలం
న్యూయార్క్ ఏప్రిల్ 9
యుఎస్ లో కరోనా వైరస్ కారణంగా ఒక్క రోజులో 1,900 మందికి పైగా మరణించడంతో ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,788 కు చేరుకుంది. ఇక్కడ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో, మృతదేహాలను ఉంచేందుకు సైతం స్థలం దొరకడం లేదు. యుఎస్‌లోని న్యూయార్క్‌లో కరోనాతో  6,268 మంది మృతి చెందగా, 151,171 మందికి వ్యాధి సోకింది. న్యూజెర్సీలో 1,504 మంది ప్రాణాలు కోల్పోయారు. 47,437 కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలకు కరోనా సోకినందున ఆసుపత్రులలో వారికి స్థలం కూడా దొరకడం లేదు. అలాగే మృతదేహాలను  దహనం చేసేందుకు స్థలం సైతం దొరకని పరిస్థితి ఉంది. అమెరికా జనాభాలో 97 శాతం మంది తమ ఇళ్లలోనే ఉంటున్నారు. వ్యాధిగ్రస్తులు కోసం  సైన్యం వేలాది పడకలను ఏర్పాటు చేసింది. వారి కార్యాలయాలను ఆసుపత్రులుగా మార్చారు.

Related Posts