YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్రమంగా తిరుగుతున్న లారీలు, ప్రైవేటు వాహనాలపై చర్యలు : రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

అక్రమంగా తిరుగుతున్న లారీలు, ప్రైవేటు వాహనాలపై చర్యలు  : రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

అక్రమంగా తిరుగుతున్న లారీలు, ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.  రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా రవాణాశాఖ అధికారులతో రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓవర్‌లోడ్ లారీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రైవేటు బస్సులన్నీ ఔటర్ రింగ్ రోడ్డు బయట నిలిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓఆర్‌ఆర్ నుంచి సిటీ లోపలికి రావడానికి ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని వెల్లడించారు. రెండు రాష్ర్టాల మధ్య రవాణా సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అద్దె భవనాలు ఉన్న జిల్లాల్లో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. త్వరలో పూర్తిస్థాయి రవాణా శాఖ కమిషనర్‌ను నియమిస్తామని చెప్పారు. ఆర్టీసీ, రవాణాశాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి మహేందర్‌ రెడ్డి ఆదేశించారు.

Related Posts