YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కూతురుపై వేధింపులు

కూతురుపై వేధింపులు

కూతురుపై వేధింపులు
చెన్నై ఏప్రిల్ 9
కామంతో కళ్లు మూసుకుపోయిన కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. బాలిక గర్భం దాల్చడంతో ఆ దుర్మార్గుడి నీచపు పని బయటపడింది. అయితే ఇక్కడ తండ్రిని రక్షించేందుకు బాలిక వేసిన ప్లాన్ పోలీసులనే ఆశ్చర్యపరిచింది. తన గర్భానికి ఓ యువకుడు కారణమని బాలిక వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తనకే పాపం తెలీదని ఆ యువకుడు మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. అయితే అనూహ్యంగా బాలిక కడుపులో బిడ్డ చనిపోవడంతో డాక్టర్లు డీఎన్ఏ టెస్టు్లు చేయగా అసలు బండారం బయటపడింది.తంజావూర్‌ జిల్లా కుంభకోణం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలికను విచారించగా ఉడైయాళూర్‌లోని మణ్ణడి వీధికి చెందిన యువకుడు (28) తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పట్టీశ్వరం పోలీసులు అతడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికకు తంజావూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక గర్భంలోని శిశువు మరణించినట్లు తేలడంతో డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. బాలిక గర్భంలో పెరిగిన శిశువుతో నిందితుడైన యువకుడికి సంబంధం డీఎన్ఏ పరీక్షలో తేలడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు, బంధువులను మరోసారి విచారించారు. ఈ సందర్భంగా తన గర్భానికి కన్నతండ్రే కారణమని బాలిక చెప్పింది. తల్లిలేని సమయంలో తండ్రి తనను బెదిరించి లోబరుచుకున్నాడని, అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బెదిరించడంతోనే మరో యువకుడిని ఇరికించినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కూతురిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ నేరాన్ని అమాయకుడైన యువకుడిపై తోసేలా పన్నాగం పన్నిన కామంధుడిపై స్థానికులు మండిపడుతున్నారు.
 

Related Posts