YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రత్యేక హోదా పై మోదీ ప్రభుత్వం దిగిరావాలి: మాజీ మంత్రి డొక్కా

ప్రత్యేక హోదా పై మోదీ ప్రభుత్వం దిగిరావాలి: మాజీ మంత్రి డొక్కా

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మోదీ ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ది చెబుతారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎక్కడ మీడియా తో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సమస్యను సీఎం చంద్రబాబు పార్లమెంట్, దేశ స్థాయికి తీసుకువెళ్లారని అన్నారు. అన్ని పక్షాల నాయకులు హోదా గురించి ఆలోచిస్తున్నారని, ఇప్పటికైనా మోదీ దిగిరాకపోతే బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెప్పడం జరుగుతుందని ఆయన అన్నారు.పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు భయపడుతోందని డొక్కా విమర్శించారు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటతీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. నోటికొచ్చినట్లు చంద్రబాబు, లోకేష్‌లపై మాట్లాడడం రాజకీయాల్లో మంచిదికాదని అన్నారు. రాజకీయంలో ఉండి, ప్రజాస్వామ్య విరుద్ధంగా.. అంటే విజయసాయిరెడ్డిలా మాట్లాడేవారికి ఒక ట్రిబ్యునల్ ప్రారంభించి.. అందులో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా మాట్లాడాలో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ రాజకీయపార్టీ నేతలు మాట్లాడినా వారందరికి ట్రైనింగ్‌కు పంపాల్సిందేదనని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రప్రభుత్వం పత్రికలగొంతు నొక్కేప్రయత్నం చేస్తోందని,  ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని ఆయన చెప్పారు.

Related Posts