అలీనోద్యమ దేశాల మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం అజర్ బైజాన్ వెళ్ళారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది. సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ శాంతి భద్రతలకు మద్దతు, ఇతివృత్తంతో ఈ నెల 5 6 తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది.అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రి ఎల్మార్ మమ్మదియరోవ్‌తో బుధవారం సుష్మా స్వరాజ్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పరస్పరం ఆసక్తిగల ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వీరు చర్చిస్తారని పేర్కొంది. ఇంధనం, రవాణా, సామర్థ్య నిర్మాణం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఈ చర్చలు దోహదపడతాయని తెలిపింది.