మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
లాక్‌డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో . ఈ సందర్భంగా ఏప్రిల్ 14(మంగళవారం)న లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న క్రమంలో మార్చి 24న విధించిన లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అత్యవసర స్థితిని తలపిస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా బుధవారం పార్లమెంటులోని ఫ్లోర్‌లీడర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.
నేటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక్కరోజులో 549 కేసులు నమోదయ్యాయని.. 17 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తివేయాలా లేదా నిబంధనలు సడలించాలా అన్న విషయంపై ప్రధాని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం