YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

లోకక్షేమం కోసమే "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణం

లోకక్షేమం కోసమే "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణం

లోకక్షేమం కోసమే "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణం
ఎస్వీబీసీ లైవ్ ద్వారా భక్తులు మంత్ర పఠనం చేసే అవకాశం
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుమల ఏప్రిల్ 10
 లోకక్షేమాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణం చేస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై శుక్రవారం ఉదయం 7 గంటలకు "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టాలని స్వామివారిని కోరుకుంటూ గత 20 రోజుల నుండి తిరుమలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా  మార్చి 16 నుండి 25వ తేదీ వరకు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం, మార్చి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించామని వివరించారు. "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ వేదమంత్రాలను పఠించి ఉపశమనం పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు మొదలై 45 నిమిషాల పాటు కొనసాగుతుందని తెలిపారు.  ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని మాట్లాడుతూ శ్రీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణం గ్రంథంలోని యోగవాశిస్టంలో శ్రీరామ, వశిష్ట సంవాదరూపమైన ఉత్పత్తి ప్రకరణంలో 69వ సర్గలో విషూచికా(సూక్ష్మక్రిమి) నివారణ మంత్రం ఉందన్నారు. ఈ మంత్రంతోపాటు శృంగేరి జగద్గురువులు లోకానికి అందించిన శ్రీ దుర్గాపరమేశ్వరి స్తోత్రం, మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించి శ్రీ ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తూ శ్రీ ధన్వంతరి మహామంత్రాన్ని పారాయణం చేసినట్టు తెలిపారు.
 

Related Posts