YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఐసీసీ తాజా ర్యాంకింగ్...!!

ఐసీసీ తాజా ర్యాంకింగ్...!!

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  (ICC )  తాజాగా  టీం  మరియు  ఆటగాళ్ల  ర్యాంకులు విడుదల  చేసింది.

టెస్ట్ ర్యాంకింగ్ లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతుంది, రెండవ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది.
టెస్ట్ బ్యాట్సమెన్ ర్యాంకింగ్ లో మొద్దటి స్థానం లో  స్టీవ్ స్మిత్ (929 పాయింట్లు ), రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ (912)  మూడో స్థానం లో  ఇంగ్లాండ్ బ్యాట్సమెన్  జో రూట్ (867) ఉన్నారు. టెస్ట్ బౌలర్ రాకింగ్ లో మొదటి స్థానం లో  సౌత్ ఆఫ్రికా బౌలర్  కాగిసో రబడా, రెండవ స్థానం లో ఇంగ్లాండ్ బౌలర్  జేమ్స్ ఆండర్సన్ ఉన్నారు.

ODI ర్యాంకింగ్ లో కూడా భారత్ జట్టు మొదటి స్థానం లోనే  ఉంది.రెండవ స్థానంలో సౌత్ ఆఫ్రికా,మూడో స్థానం లో ఇంగ్లాండ్ ఉన్నాయి.   ODI బ్యాట్సమెన్ ర్యాంకింగ్ లో మొదటి స్థానం లో విరాట్ కోహ్లీ(909) ,రెండవ స్థానం లో డి విల్లియర్స్ (844), మూడో స్థానం లో  డేవిడ్ వార్నర్ (823) ఉన్నారు.బౌలింగ్ విభాగం లో మొదటి స్థానం లో బుమ్రా,రెండవ స్థానంలో  ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్  రషీద్ ఖాన్, మూడో స్థానం లో హాజల్ వుడ్  ఉన్నారు.

టీ 20  లో మొదటి స్థానం పాకిస్తాన్,రెండవ స్థానం లో ఆస్ట్రేలియా,మూడో స్థానంలో  టీం ఇండియా ఉన్నాయి. టీ 20 బ్యాటింగ్  విభాగం లో మొదటి స్థానం లో  కివీస్ బ్యాట్సమెన్ కోలిన్ మున్రో,రెండవ స్థానం లో ఆసీస్ బ్యాట్సమెన్ గ్లెన్ మాక్స్వెల్, మూడో స్థానం లో పాక్ బ్యాట్సమెన్ బాబర్ అజాం ఉన్నారు. బౌలింగ్ విభాగం లో ఆఫ్గనిస్తాన్ పెను సంచలనం రషీద్ ఖాన్  మొదటి స్థానం లో ఉన్నాడు.
రెండు,మూడు స్థానాలలో చాహల్,కివీస్ బౌలర్ ఇష్ సోది ఉన్నారు. అల్ రౌండర్ విభాగం లో మొదటి స్థానం బంగ్లా  స్టార్ క్రికెటర్  షకీబ్ ఆల్ హాసన్ దకించుకున్నాడు.


పాకిస్తాన్ వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన టీ 20 సిరీస్ లో పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేయడం తో టీ 20 టీం ర్యాంకింగ్ లో మొదటి స్థానానికి ఎగబాకింది .

Related Posts