YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా కట్టడికి కొన్వాల్‌సెంట్ ప్లాస్మా థెర‌పీ

కరోనా కట్టడికి కొన్వాల్‌సెంట్ ప్లాస్మా థెర‌పీ

కరోనా కట్టడికి కొన్వాల్‌సెంట్ ప్లాస్మా థెర‌పీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10
ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టేందుకు అనేక దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే క‌రోనాకు అడ్డుకునేందుకు వివిధ ర‌కాలైన ప‌ద్ధ‌తుల‌ను సైంటిస్టులు ప‌రీక్షిస్తున్నారు. తాజాగా క‌రోనాను స‌మ‌ర్థంగా అడ్డుకునే కొన్వాల్‌సెంట్ ప్లాస్మా థెర‌పీని అభివృద్ధి చేశారు. మ‌న‌దేశంలోనే దీన్ని రోగుల‌పై ప‌రీక్షించేందుకుగాను క్లినికల్ ట్ర‌య‌ల్స్‌కు మార్గం సుగ‌మం కానుంది. ఇప్ప‌టికే ఈ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించారు. డ్ర‌గ్ కంట్రోల‌ర్‌ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డీసీడీజీ) ఆమోదం పొంద‌గానే ఈ థెర‌పీని ప్రారంభించ‌నున్నారు.దేశవ్యాప్తంగా కేర‌ళ‌లో తొలిసారిగా ఈ థెరపీని ప‌రీక్షించేందుకు అనుమ‌తించనున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలోని ప్ర‌తిష్టాత్మ‌క విద్యాల‌యం శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీకి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించుకునేందుకు త్వ‌ర‌లోనే అనుమ‌తులు రానున్న‌ట్లు ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు. ఈ ప్లాస్మాథెర‌పీ ప‌ద్ధ‌తిలో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న రోగుల నుంచి యాంటి బాడీలను సేక‌రించి, వ్యాధితో పోరాడుతూ, చివ‌రిద‌శ‌లో ఉన్న‌ రోగుల‌కు అందిస్తారు.ఇప్ప‌టికే చాలా దేశాలలో ఈ ప‌ద్ధ‌తి విజ‌య‌వంత‌మైంది. వెంటిలెట‌ర్‌పై ఉన్న రోగులు కోలుకున్న దాఖ‌లాలు ఉన్నాయి. మ‌న‌దేశంలోనూ ఈ ప‌ద్ధ‌తిని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ రూపంలో నిర్వ‌హించ‌నున్నారు. ఫ‌లితాలను బేరీజు వేసిన అనంత‌రం దీనిపై కేంద్రం నిర్ణ‌యం తీసుకోనుంది. ఇక చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్‌కు సంబంధించి 16 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 95 వేల మంది మ‌ర‌ణించారు.
 

Related Posts