YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం దేశీయం

మాస్క్ లేకుండా బయిటకు వస్తే 200

మాస్క్ లేకుండా బయిటకు వస్తే 200

మాస్క్ లేకుండా బయిటకు వస్తే 200
భువనేశ్వర్, ఏప్రిల్ 10
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒడిశాలో లాక్‌డౌన్‌ను మరింత సమర్ధంగా అమలుచేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధన తీసుకొచ్చారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘తొలిసారి మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.200 ఫైన్ కట్టాలి, మూడుసార్లు వరకు ఇదే వర్తిస్తుంది.. నాలుగోసారి ఉల్లంఘిస్తే మాత్రం రూ.500 చెల్లించాల్సి’ ఉంటుందని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ త్రిపాఠీ వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.ఒడిశా కోవిడ్-19 (సవరణ) నిబంధనలు 2020లో మార్పులు చేశామని, దీని ప్రకారం మాస్క్ లేకుండా ఇళ్ల నుంచి బయటకు వస్తే జరిమానా చెల్లించాలని గురువారం స్పష్టం చేశారు. గురువారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు లేదా కర్చీఫ్‌లు, దుప్పటా, స్కార్ప్‌లతో ముఖాన్ని కప్పుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం పోలీసులే స్వయంగా పలువురికి మాస్క్‌లు పంపిణీ చేశారు. అయితే, సాయంత్రం నుంచి ఎవరు మాస్క్ లేకుండా బయట తిరిగినా జరిమానా వసూలు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కుల కొరత ఉండటంతో.. ఇళ్లలో తయారు చేసిన క్లాత్ మాస్కుల‌ను కూడా వినియోగించొచ్చని తెలిపింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది.మాస్క్ తప్పనిసరి నిబంధనలు రాజస్థాన్ సైతం తప్పనిసరి చేసింది. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
 

Related Posts