YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

మాస్క్ లు తప్పని సరి

మాస్క్ లు తప్పని సరి

మాస్క్ లు తప్పని సరి
హైద్రాబాద్, ఏప్రిల్ 10 
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కుల కొరత ఉండటంతో.. ఇళ్లలో తయారు చేసిన క్లాత్ మాస్కుల‌ను కూడా వినియోగించొచ్చని తెలిపింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. ఇప్పటి వరకూ వైద్య సిబ్బంది, పోలీసులు, అనారోగ్యంతో ఉన్న వారు మాత్రమే మాస్కులు వాడుతున్నారు. కానీ ఇక నుంచి ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు వాడటాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.కరోనా బారిన పడిన చాలా మందిలో లక్షణాలేవి కనిపించడం లేదు. వారి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫేస్ మాస్కులను కచ్చితంగా ఉపయోగించాలని సూచించింది. మాస్కులు ధరించడం అంటే మెడకు వేలాడదీసుకోవడం కాదని.. ముక్కు, నోరు, చెంపలు కవర్ అయ్యేలా చూసుకోవాలని తెలిపింది.ఇప్పటికే ముంబై నగరపాలక సంస్థతోపాటు ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రభుత్వాలు బయటకు వచ్చే వాళ్లు కచ్చితంగా ఫేస్ మాస్కులు ధరించాలని ప్రజలను ఆదేశించాయి

Related Posts