ఇజ్రాయిల్ కు భారత్ మందులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10
కరోనా వైరస్ ప్రభావంతో భారత్ విదేశాలకు ఔషధాలు, మాస్కులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ కోవిడ్‌తో విలవిల్లాడుతున్న మిత్ర దేశాలకు మాత్రం సాయం చేయడం కోసం నిషేధాన్ని భారత్ సడలించింది. డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్‌పై అమెరికాకు ఇంతకు ముందే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఇజ్రాయెల్, బ్రెజిల్ లాంటి మిగతా దేశాలు కూడా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాలను సరఫరా కోసం భారత్ వైపు చూస్తున్నాయి.భారత్‌కు అత్యంత మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు కూడా భారత్ క్లోరోక్విన్ ఔషధాన్ని సరఫరా చేస్తోంది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. మన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మిత్రమా.. నీకు ఇజ్రాయెలీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.దీనికి ప్రధాని మోదీ కూడా స్పందించారు. కరోనా మహమ్మారిపై మనం కలిసి పోరాడాలని మోదీ పిలుపునిచ్చారు. తన మిత్రులకు సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.భారత్‌కు ఇజ్రాయెల్ ఎంతో నమ్మకమైన మిత్ర దేశమనే సంగతి తెలిసిందే. బెంజమిన్ నెతన్యాహూ మోదీ పట్ల ఇష్టాన్ని ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటారు. మనం రక్షణ సాంకేతిక వ్యవహరాల్లో ఇజ్రాయెల్ సహకరిస్తోంది.